
మెదక్: భారీ ప్రమాదం.. పరిశ్రమలో చెలరేగిన మంటలు
మనోహరాబాద్ మండలం కూచారం గ్రామ శివారులోని హార్న్ బ్యాక్ ఈ-మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా పరిశ్రమ కార్యాలయంలో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ, కార్యాలయంలోని కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. నష్టం అంచనా వేస్తున్నారు.

































