పటాన్ చెరు: లాడ్జీలో మహిళ అనుమానాస్పద మృతి

2363చూసినవారు
పటాన్ చెరు: లాడ్జీలో మహిళ అనుమానాస్పద మృతి
చందానగర్ నైట్ ఐ లాడ్జిలో 39 ఏళ్ల నర్సమ్మ అనే మహిళ మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. నిన్న మధ్యాహ్నం ఆమె మరో వ్యక్తితో కలిసి లాడ్జికి వెళ్లగా, దుండగుడు చున్నీతో గొంతు నులిమి హత్య చేసి పరారయ్యాడు. ఈరోజు ఉదయం హోటల్ సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్