గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని అన్నారం గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం కారు మెకానిక్ షెడ్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు వేగంగా వ్యాపించి షెడ్డులో ఉన్న రెండు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎయిర్ ఫోర్స్ అకాడమీ, హెటిరో పరిశ్రమల ఫైర్ ఇంజన్లు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. ఈ దుర్ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది. మంటలు ఎలా చెలరేగాయనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.