సదాశివపేట: యువకుడిని ఢీకొన్న బొలెరో.. స్పాట్ డెత్

3126చూసినవారు
సదాశివపేట: యువకుడిని ఢీకొన్న బొలెరో.. స్పాట్ డెత్
సదాశివపేట బైపాస్ రోడ్డులో ఆదివారం ఎస్ఎన్ ఫుడ్ కోర్ట్ సమీపంలో స్కూటీపై వెళ్తున్న యువకుడిని వెనుక నుంచి వేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు యువకుడు వాహనం కిందే చిక్కుకుపోగా, డ్రైవర్ ఆపకుండా సుమారు అర కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లాడు. దీంతో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.