Nov 22, 2025, 06:11 IST/
మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం (వీడియో)
Nov 22, 2025, 06:11 IST
AP: నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మద్దూరుమెట్ట జాతీయ రహదారిపై పీఆర్ఎల్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు లారీని ఢీకొట్టి మరో ప్రమాదానికి గురైంది. చెన్నై నుంచి కర్నూలు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్న 45 మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నప్పటికీ, డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జయింది. అతివేగం, ఓవర్ టేక్ చేయడమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.