
సంగారెడ్డి: వెంకటేశ్ గౌడ్ మృతి
సంగారెడ్డిలోని ఓ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా విద్యానగర్‌కు చెందిన వెంకటేశ్ గౌడ్ మృతి చెందడంతో బుధవారం కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు. సరైన చికిత్స అందించకపోవడమే మృతికి కారణమని వారు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కుటుంబ సభ్యులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతుడి బంధువులు బాధ్యులైన వైద్యులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.




































