సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఓ షాపింగ్ మాల్‌లోని ఫుడ్ కోర్టులో వినియోగదారుడు కొనుగోలు చేసిన నూడుల్స్‌లో బొద్దింక కనిపించడంతో కలకలం రేగింది. రుద్రారం గ్రామానికి చెందిన శివ అనే వ్యక్తి తన తల్లితో కలిసి వాల్యూ జోన్ ఆవరణలోని ఫుడ్ కోర్టులో నూడుల్స్ కొనుగోలు చేశాడు. సగం తిన్న తర్వాత అందులో బొద్దింక కనిపించడంతో నిర్వాహకులను ప్రశ్నించాడు. తొలుత నిర్లక్ష్యంగా సమాధానమిచ్చిన నిర్వాహకులు, తర్వాత తొలిసారి తప్పు జరిగిందని తెలిపారు.