నారాయణఖేడ్‌లో 125 మందికి ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉచిత శిక్షణ

8చూసినవారు
నారాయణఖేడ్‌లో 125 మందికి ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉచిత శిక్షణ
ఎస్‌ఐ, పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు సంగారెడ్డి జిల్లా సబ్‌ కలెక్టర్‌ ఉమా హారతి తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ అభ్యర్థులు అర్హులని, మొత్తం 125 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 21 నుంచి 26 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. సెప్టెంబర్‌ 28న ఎంపిక పరీక్ష నిర్వహించి, ఎంపికైన వారికి నిపుణులతో ఉచిత శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్