నారాయణఖేడ్ లో ముత్యంరెడ్డి హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. భార్య కల్పన, ఆమె ప్రియుడు పండరి కలిసి ముత్యంరెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 15న ముగ్గురూ కలిసి హోటల్ కు వెళ్లిన దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. 16న పొలానికి తీసుకెళ్లి ముత్యంరెడ్డిని హత్య చేసి పాతిపెట్టారు. భర్త కనిపించడం లేదని కల్పన 18న పోలీసులకు ఫిర్యాదు చేసింది.