కంది గ్రామంలో మంగళవారం రాత్రి 10 గంటలకు ఇంటిముందు నిలిపిన బైక్ ను గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేశారు. రెండో వార్డ్ కు చెందిన పాండు తన బైక్ ను పార్కింగ్ చేసి లోపలికి వెళ్లగా, అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.