కంది: పిడుగు పడి రైతు మృతి

2289చూసినవారు
కంది: పిడుగు పడి రైతు మృతి
కంది మండలం కాశీపూర్ గ్రామంలో సోమవారం పిడుగుపాటుకు 60 ఏళ్ల జంగయ్య అనే రైతు మృతి చెందాడు. పొలం వద్ద ఎడ్లకు మేత వేసి, సాయంత్రం చెట్టు కింద కూర్చున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఎస్సై విజయ్ కుమార్ కథనం ప్రకారం, చెట్టుపై నుంచి పిడుగు పడడంతో జంగయ్య అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్