కొండాపూర్ మండలం మల్కాపూర్ శివారులో బుధవారం సాయంత్రం వేగంగా వెళుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం 108 వాహనంలో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్రాక్టర్ బోల్తా కొట్టడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.