స్కాలర్‌షిప్‌లు, ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ముట్టడి జరిగింది. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి బాషా, నాయకులు కలెక్టరేట్ గేటు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంఘటనతో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.