పుల్కల్: గోనె సంచిలో మృతదేహం కలకలం

1581చూసినవారు
పుల్కల్: గోనె సంచిలో మృతదేహం కలకలం
సింగూర్ ప్రాజెక్టులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఉదయం చేపల వేటకు వెళ్లిన వారు నీటిలో గోనె సంచిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు దాన్ని బయటకు తీయగా, లోదుస్తులతో ఉన్న 40-45 ఏళ్ల వ్యక్తి మృతదేహం బయటపడింది. ఎవరో హత్య చేసి సంచిలో మూటకట్టి పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్