సంగారెడ్డిలో సైబర్ కేటుగాళ్లు ఇంటి పన్నులు, ఇతర పన్నులు వెంటనే చెల్లించకపోతే చర్యలు తీసుకుంటామని, తాము పంపిన స్కానర్ ద్వారా పన్నులు కట్టాలని సోషల్ మీడియాలో కొత్త మోసాలకు తెరలేపారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పట్టణ ప్రజలకు సూచనలు చేశారు. ఇంటి, నీటి కుళాయి, వ్యాపార పన్నులు మున్సిపల్ కార్యాలయంలోనే చెల్లించాలని, బిల్ కలెక్టర్లు నేరుగా ఇంటికి వచ్చి నగదు స్వీకరించి రశీదు ఇస్తారని తెలిపారు. వాట్సాప్ ద్వారా స్కానర్ పంపి నగదు అడిగితే అది సైబర్ నేరమని, పెనాల్టీ వస్తుందని బెదిరించి డబ్బులు అడిగితే నమ్మవద్దని ప్రజలను హెచ్చరించారు.