సంగారెడ్డి: పవన్ కళ్యాణ్ నోట జగ్గారెడ్డి పేరు

874చూసినవారు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేరును మరోసారి ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, జగ్గారెడ్డి, వి. హనుమంతరావు చెప్పినట్లుగా కూర్చొని మాట్లాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ నోట జగ్గారెడ్డి పేరు రావడంతో సంగారెడ్డి జిల్లాలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.