సంగారెడ్డి జిల్లాలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మే 8వ తేదీన తార ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జాబ్ మేళా పోస్టర్లను ఆవిష్కరించిన ఆయన, వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల కల్పనకు ఈ మేళా దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా యువతకు మంచి భవిష్యత్తు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.