బిచ్కుంద మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు గోనె పీరయ్య (41) అప్పుల భారాన్ని తట్టుకోలేక చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం నింపింది. మద్నూర్ మండలం పెద్ద శేక్కర్గ గ్రామంలోని తల్లిగారి ఇంట్లో ఉంటున్న ఆయన, సంగారెడ్డిలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నట్లు చెప్పి బయలుదేరి తిరిగి రాలేదు. కనిపించకుండా పోయినట్లు ఫిర్యాదు చేయగా, పెద్ద శేక్కర్గ గ్రామ చెరువులో మృతదేహం లభ్యమైంది. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.