వాగులో మునిగి యువకుడు మృతి

6చూసినవారు
వాగులో మునిగి యువకుడు మృతి
జిన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దమ్మ గూడెం వద్ద రాజు అనే యువకుడు గ్రామ శివారులోని వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ వద్ద గొర్రెలను దాటించే సమయంలో నీటిలో మునిగి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెతికి మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్