సంగారెడ్డి: 22 రోజుల వ్యవధిలో దంపతులు మృతి

5చూసినవారు
సంగారెడ్డి: 22 రోజుల వ్యవధిలో దంపతులు మృతి
సంగారెడ్డి పట్టణం మంజీరానగర్కు చెందిన 82 ఏళ్ల సాద ప్రకాశ్రావు, ఆయన సతీమణి శాంతాబాయి 22 రోజుల వ్యవధిలో మృతిచెందారు. పంచాయతీరాజ్ శాఖలో పర్యవేక్షకుడిగా పనిచేసి పదవీ విరమణ పొందిన ప్రకాశ్రావు ఈ నెల 4న అనారోగ్యంతో మరణించారు. భర్త మరణంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురైన శాంతాబాయి, ఈ నెల 24న ఇంట్లో అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం గుండెపోటుతో మృతిచెందారు. నెలలోపే ఇద్దరి మరణంతో కుటుంబీకులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.

సంబంధిత పోస్ట్