చేర్యాల మండలం ముస్త్యాల ఎల్లమ్మ గుడి వద్ద నిన్న జరిగిన ప్రమాదంలో మృతుడు సిద్దిపేటలోని హనుమాన్ నగర్‌కు చెందిన చింతల వెంకటేష్(38)గా పోలీసులు గుర్తించారు. తన టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో వెంకటేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అపూర్వ రెడ్డి తెలిపారు.