సిద్దిపేట: మున్సిపల్ హోరు.. టికెట్ల కోసం పోరు !

0చూసినవారు
సిద్దిపేట: మున్సిపల్ హోరు.. టికెట్ల కోసం పోరు !
గజ్వేల్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. టికెట్ వస్తుందనే ధీమాతో అన్ని పార్టీలలో ఆశావాహులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీలు చాలా వరకు అభ్యర్థులను ఇంకా అధికారికంగా ప్రకటించక పోవడంతో నామినేషన్ వేసిన వారు టికెట్ వస్తుందో లేదో అని టెన్షన్ పడుతున్నారు. హుస్నాబాద్‌లో 149, గజ్వేల్ 185, దుబ్బాక 235, చేర్యాలలో 85 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో టికెట్ల కోసం పార్టీల్లో తీవ్ర పోటీ నెలకొంది.

సంబంధిత పోస్ట్