Nov 10, 2025, 03:11 IST/
రచయిత అందెశ్రీకి దక్కిన అవార్డులు ఇవే!
Nov 10, 2025, 03:11 IST
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన అందెశ్రీ సినీ రంగానికి కూడా విశేష సేవలందించారు. 2006లో గంగ చిత్రానికి గాను ఆయనకు నంది పురస్కారం లభించింది. 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథి సాహితీ పురస్కారం, రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో నకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్ నాయక్ పురస్కారం అందుకున్నారు. అదేవిధంగా కాకతీయ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.