Feb 24, 2026, 18:02 IST/
VIDEO: జేఈని రోడ్డుపై చితకబాదిన లైన్మెన్ భార్య
Feb 24, 2026, 18:02 IST
ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్ జిల్లాలో విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (JE) అజిత్ కుమార్‌పై ఒక మహిళ బహిరంగంగా దాడి చేయడం కలకలం రేపింది. సదరు మహిళ తన భర్తను (కాంట్రాక్ట్ లైన్మెన్) ముందస్తు సమాచారం లేకుండా విధుల్లో నుండి తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ దాడికి పాల్పడింది. సోమవారం సాయంత్రం చౌదరిడీ గ్రామ పంచాయతీ వద్ద జరిగిన ఈ ఘర్షణలో మహిళ జేఈని నోటితో కొరుకుతూ.. కాలర్ పట్టుకుని తీవ్రంగా కొట్టింది.