Apr 13, 2026, 17:04 IST/గజ్వేల్
గజ్వేల్
పరీక్షా కేంద్రాలలో కట్టుదిట్టమైన నిబంధనలు అమలు చేయాలి
Apr 13, 2026, 17:04 IST
జిల్లా కలెక్టర్ హైమావతి సోమవారం కొండపాక మండలం దుద్దేడ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మార్చి 14న ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు, ఎస్ఎస్సీ–2026 బోర్డు మార్గదర్శకాల మేరకు ఎలాంటి అంతరాయాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా కొనసాగుతున్నాయని తెలిపారు. మిగిలిన పరీక్షలను కూడా ఇదే విధంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.