సిద్దిపేట ఫస్ట్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కుమారి వి. తరణి, మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 17 మంది వాహనదారులకు శుక్రవారం జరిమానా విధించారు. పట్టణంలో ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ నిర్వహించిన తనిఖీల్లో వీరు పట్టుబడ్డారు. న్యాయమూర్తి 17 మందికి మొత్తంగా రూ. 1,73,000 జరిమానా విధించడంతో పాటు, ఒక వ్యక్తికి 2 రోజుల జైలు శిక్ష కూడా విధించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ట్రాఫిక్ సీఐ సూచించారు.