సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలకు చెందిన 31 మంది విద్యార్థులు కోవలెంట్ లేబరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఉద్యోగాలు సాధించారు. బుధవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్కిల్ అండ్ నాలెడ్జి సెంటర్, కెరియర్ గైడెన్స్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్ మెంట్ డ్రైవ్‌లో 72 మంది విద్యార్థులు పాల్గొనగా, 31 మంది ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత తెలిపారు.