సిద్దిపేట జిల్లా, చిన్నకోడూరు మండల పరిధిలోని కొచ్చగుట్టపల్లి గ్రామంలో 9వ జాతీయ పోషణ్ మాసోత్సవ ప్రచార కార్యక్రమం మంగళవారం వైభవంగా జరిగింది. మన అంగన్వాడీ మన బాధ్యత నినాదంతో అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ చెలుకల నాగార్జున రెడ్డి, ఉపసర్పంచ్ తాడురి రాకేష్ పోషణ్ మాసం బ్యానర్‌ను ఆవిష్కరించి, ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ కూడా పాల్గొన్నారు.