భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల ఎన్నికల అధికారులు, ఈ. ఆర్. ఓ. లు, ఎ. ఈ. ఆర్. ఓ. లతో నిర్వహించిన సమీక్షలో, నిర్దేశిత కార్యాచరణ ప్రకారం ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, వివరాల నమోదు ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు. ఓటరు జాబితాలో పేరు నమోదుకు ప్రతి ఒక్కరూ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తిచేసి అందించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి పేర్కొన్నారు.