సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ గ్రామంలో స్నేహ మిత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రులలో భాగంగా గణనాథుడికి పసుపు కుంకుమ మంగళహారతితో ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం శనివారం ఆడపడుచులు, చిన్న పెద్ద తేడా లేకుండా భక్తి పాటలతో, నృత్యాలు చేస్తూ స్వామివారిని గంగమ్మ ఒడికి తరలించారు. దుద్దెడ జయశంకర్ నగర్ కాలనీ వాసులు, స్నేహ మిత్ర యూత్ అసోసియేషన్ సభ్యులు ఈ శోభాయాత్రలో పాల్గొని, స్వామివారికి అంగరంగ వైభవంగా వీడ్కోలు పలికారు.