ఎర్రవల్లికి భారీగా బీఆర్ఎస్ నేతలు

3చూసినవారు
ఎర్రవల్లికి భారీగా బీఆర్ఎస్ నేతలు
సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఆదివారం తన వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరిన కేసీఆర్.. హైదరాబాద్ లోని నందినగర్ నివాసానికి చేరుకున్నారు. అంతకుముందు ఎర్రవల్లితోపాటు సమీప గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో వ్యవసాయ క్షేత్రం వద్ద రద్దీ నెలకొంది. నల్ల బ్యాడ్జీలు ధరించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్