విద్యార్థుల బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ సీడింగ్ పూర్తి చేయాలి

1చూసినవారు
విద్యార్థుల బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ సీడింగ్ పూర్తి చేయాలి
సిద్ధిపేట జిల్లా కలెక్టర్ హైమావతి, ఎస్సీ సంక్షేమ వసతి గృహాలలో చదివే ప్రీ మెట్రిక్ విద్యార్థుల స్కాలర్షిప్ ల కొరకు జిల్లాలో పెండింగ్ లో ఉన్న విద్యార్థుల బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ సీడింగ్ త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎస్సీ హాస్టల్లలో చదువుతున్న 863 మంది ప్రీమెట్రిక్ విద్యార్థుల స్కాలర్షిప్ లు, విద్యార్థుల బ్యాంక్ అకౌంట్లకు వారి ఆధార్ నెంబర్లను అనుసంధానించని మూలంగా పెండింగ్ లో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్