విద్యారంగ సమస్యల పరిష్కారంలో ఏబీవీపీ ముందంజలో ఉంటుంది

4చూసినవారు
విద్యారంగ సమస్యల పరిష్కారంలో ఏబీవీపీ ముందంజలో ఉంటుంది
సిద్దిపేట పట్టణంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నూతన కమిటీ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు లక్ష్మణ్, రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు ఆదిత్య మాట్లాడుతూ, విద్యారంగ సమస్యల పరిష్కారంలో ఏబీవీపీ ఎప్పుడూ ముందంజలో ఉంటుందని భరోసా ఇచ్చారు. నూతన కమిటీలో తిప్పేట తరుణ్ పట్టణ నగర కార్యదర్శిగా, రవీందర్, కార్తీక్, కృష్ణ ఉపాధ్యక్షులుగా, నితిన్, లోకేష్, ఆకాల్ సంయుక్త కార్యదర్శులుగా, అమూల్య మహిళ కన్వీనర్‌గా, అఖిల మిషన్ సాహసీ కన్వీనర్‌గా, యోగేష్ ఎస్ఎఫ్ డీ కన్వీనర్‌గా, ప్రశాంత్ ఎస్ఎఫ్డీ కో కన్వీనర్‌గా, అజయ్ ఎస్ఎఫ్ఎస్ కన్వీనర్‌గా, శ్రీకాంత్ కో-కన్వీనర్‌గా, భాస్కర్ సోషల్ మీడియా కన్వీనర్‌గా, హరీశ్ కో-కన్వీనర్‌గా ఎన్నికయ్యారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి నూతన కమిటీ కృషి చేస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్