అదనపు కట్నం కేసులో నిందితుడికి ఏడాది జైలు, జరిమానా

2చూసినవారు
అదనపు కట్నం కేసులో నిందితుడికి ఏడాది జైలు, జరిమానా
అదనపు కట్నం తీసుకురావాలని భార్యను వేధించిన కేసులో సిద్దిపేట ఒకటవ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ తరుణి నిందితుడు కొత్వాల్ సందీప్‌కు ఏడాది సాధారణ జైలు శిక్షతో పాటు రూ. 10 వేల జరిమానా విధించారు. పట్టణానికి చెందిన సందీప్ తరచూ తన భార్యను అదనపు కట్నం కోసం వేధించడంతో ఆమె సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పూర్తిస్థాయి విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్