సిద్దిపేట జిల్లాలో కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు ఎల్కేజీ, యూకేజీలకు అధిక ఫీజులు వసూలు చేస్తూ సామాన్య, మధ్యతరగతి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి యాదగిరి అన్నారు. పాఠశాలలు ప్రారంభం కాకముందే పుస్తకాలు, యూనిఫామ్ లను అధిక ధరలకు అమ్ముతూ విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తున్న పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలని, అనుమతులు లేని పాఠశాలలను సీజ్ చేయాలని బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు.