అదనపు కలెక్టర్ గరీమా అగ్రవాల్ సేవలు అభినందనీయం

532చూసినవారు
అదనపు కలెక్టర్ గరీమా అగ్రవాల్ సేవలు అభినందనీయం
రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఇంచార్జి కలెక్టర్ గా బదిలీ అయిన గరీమా అగ్రవాల్ కు కలెక్టరేట్ లో ఘనంగా వీడ్కోలు, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా కలెక్టర్ హైమావతి, గరీమా అగ్రవాల్ అదనపు కలెక్టర్ గా జిల్లా ప్రజలకు అందించే సేవల్లో ముందుంటూ అభినందనలు పొందారని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, మంత్రుల పర్యటన, స్థానిక సంస్థల ప్రణాళిక వంటి పనులను నిబద్ధతతో చేశారని, తనకు ఎంతో తోడ్పాటును అందించారని కలెక్టర్ హైమావతి కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్