సిద్దిపేట పట్టణంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ఈ నెల 3 నుంచి రెండ్రోజుల పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై జాతీయస్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత గురువారం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సదస్సుకు దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల పరిశోధకులు తమ పరిశోధనా పత్రాలను సమర్పిస్తారని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై నిర్వహించే ఈ సదస్సు మొట్టమొదటిదన్నారు.