ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు: ఏఐఎస్ఎఫ్ నేత అరెస్ట్

528చూసినవారు
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు: ఏఐఎస్ఎఫ్ నేత అరెస్ట్
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జేరిపోతుల జనార్థన్‌ను మంగళవారం అక్కన్నపేట పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఇంటికి చేపట్టిన పాదయాత్రలో పాల్గొనకుండా పోలీసులు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. జనార్థన్‌ను ఆయన నివాసం వద్ద అదుపులోకి తీసుకుని అక్కన్నపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్