కార్మికుల హక్కుల సాధనకు ఏఐటీయూసీ రాజీలేని పోరాటం

8చూసినవారు
కార్మికుల హక్కుల సాధనకు ఏఐటీయూసీ రాజీలేని పోరాటం
కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటాలు చేస్తున్న గొప్ప కార్మిక సంఘం ఏఐటీయూసీ మాత్రమేనని సంఘం రాష్ట్ర నాయకులు అందె అశోక్ అన్నారు. శుక్రవారం కార్మిక సంఘం 106వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో సంఘం జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ నేడు భారతదేశంలో కార్మిక వర్గం నెత్తురు చిందించి ప్రాణ త్యాగాలు చేసిన చరిత్ర ఉందన్నారు. కార్మిక చట్టాలను కాపాడుకునేందుకు దేశవ్యాప్తంగా కార్మికులు పోరాటాలకు సన్నద్ధం కావాలని వారు కార్మిక లోకానికి పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్