జగదేవపూర్ మండలంలోని నబీనగర్ లో ఆదివారం ప్రేమించిన అమ్మాయి పెళ్లికి ఒప్పుకోకపోవడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో మద్యానికి బానిసైన బింగి నర్సింలు (28) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో రెండుసార్లు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న నర్సింలు, ఈ నెల 24న ఇంట్లో గొడవపడి వెళ్లిపోయాడు. శనివారం రాత్రి వ్యవసాయ బావిలో అతని మృతదేహం కనిపించడంతో, ఆదివారం వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.