వైద్య ఆరోగ్య శాఖ పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జిల్లా కలెక్టర్ హైమావతి శనివారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 0-5 ఏళ్ల పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి 568 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 94,321 మంది పిల్లలకు చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కార్యక్రమ పర్యవేక్షణకు 57 మంది సూపర్వైజర్లు, డిప్యూటీ డిఎంహెచ్వోలు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఉంటారు. బస్టాండులు, రైల్వేస్టేషన్లలో 32 ట్రాన్సస్ట్ పాయింట్లలో కూడా పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు చేశారు.