సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులకు చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యాలు కూడా చాలా కీలకమని అన్నారు. కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ విద్యార్ధుల కోసం ఏర్పాటు చేసిన ఏఐ అండ్ డిజిటల్ లెర్నింగ్ శిక్షణను ప్రారంభించిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తక పరిజ్ఞానంతో సరిపెట్టుకోకుండా, సాంకేతిక నైపుణ్యాలు, కమ్యూనికేషన్ సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు, డిజిటల్ అవగాహన మరియు బోధనా నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవాలని ఆమె సూచించారు.