సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన కత్తుల నర్మద హైదరాబాదులోని బిర్లా మందిరంలో బ్యూటిషియన్ రంగంలో నంది అవార్డును నటుడు బాబు మోహన్ చేతుల మీదుగా అందుకున్నారు. గతంలో సైమా అవార్డు కూడా అందుకున్న ఆమె, ఏ రంగంలోనైనా పట్టుదల, సమయస్ఫూర్తి, కష్టంతో పనిచేస్తే గుర్తింపు వస్తుందని అన్నారు. ఐదేళ్లుగా కష్టపడి నేర్చుకుని పనిచేస్తున్నానని, నచ్చిన రంగంలో ఇష్టపడి పనిచేస్తే ఉన్నత లక్ష్యాలు సాధించవచ్చని ఆమె తెలిపారు.