ఆదర్శ పాఠశాలల ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పొడిగింపు

2చూసినవారు
ఆదర్శ పాఠశాలల ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పొడిగింపు
సిద్దిపేట జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, 2026-27 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశాలతో పాటు 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తు గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. విద్యార్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఓసీ అభ్యర్థులు రూ. 200, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్సీ అభ్యర్థులు రూ. 125 ఫీజు చెల్లించాలని సూచించారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 19న జరుగుతుందని, అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్