గజ్వేల్ నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా, వర్గల్ మండలం గౌరారం గ్రామంలో రోడ్డు ప్రమాదాలపై తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు అవగాహన కల్పించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, కళాకారులు పిల్లుట్ల శ్యాంసుందర్, సన్వాల కనకయ్య, పిన్నింటి రత్నం, పిన్నింటి ప్రకాష్, ఫన్నీరు శ్రీనివాస్, గెంటే హరిప్రసాద్, ఎల్లా సిద్ధులు, తండ బిక్షపతి, రాచపల్లి శైలజలు తమ ఆటపాటలతో ప్రజలను చైతన్యపరిచారు. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, సీటు బెల్టు తప్పక పెట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నగరం కనకరాజు, ఉప సర్పంచ్ వెల్దుర్తి శ్రీకాంత్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.