రైతులకు 3 గంటల విద్యుత్ చాలని కోదండరెడ్డి ఈఆర్‌సీ వద్ద చెప్పారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి మనసులోని మాటను కోదండరెడ్డి బయటపెట్టారని ఆయన ఆరోపించారు. 24 గంటల కరెంట్‌కు కోత పెట్టేందుకే రైతు డిస్కమ్ పేరిట డ్రామాలాడుతున్నారని విమర్శించారు. రైతులను చీకట్లోకి నెట్టేందుకు
కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని, ఈ ప్రభుత్వానికి రైతులు బుద్ధి చెబుతారని మండిపడ్డారు.