సిద్ధిపేట జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హైమావతి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జరిగిన జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో పోలీసు కమిషనర్ రష్మీ పెరుమాళ్ తో కలిసి మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వినియోగం వల్ల ప్రజలు విచక్షణ కోల్పోయి సమాజానికి హాని కలిగిస్తున్నారని, ఆరోగ్యం క్షీణించి అనేక సమస్యలకు దారితీస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దురలవాటును అరికట్టడానికి అధికారులు సమష్టిగా కృషి చేయాలని సూచించారు.