సిద్దిపేట జిల్లా నంగునూరులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యూత్ టూరిజం క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు స్థానిక చారిత్రక సంపద, వారసత్వ ప్రదేశాలు, పురాతన ఆనవాళ్లపై అవగాహన కల్పించేందుకు హెరిటేజ్ వాక్ నిర్వహించారు.
విద్యార్థులు జోకిరమ్మ బండను సందర్శించి, 1200 ఏళ్ల నాటి వర్ధమాన మహావీరుని విగ్రహం, కొత్త రాతియుగానికి చెందిన ఆనవాళ్లు, గ్రూవ్స్, నూరుడు గుంతలను పరిశీలించారు. చరిత్ర పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ విద్యార్థులకు విశేషాలు వివరించారు. అనంతరం స్థానిక రామాలయాన్ని సందర్శించారు.