సిద్దిపేట జిల్లా, నంగునూరు మండలం గణపురం గ్రామపంచాయతీలో, గ్రామ సర్పంచ్ సాయి గారి ఆధ్వర్యంలో ఆదివారం ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించారు. మధ్యాహ్నం, తెలంగాణ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, చదువుపై దృష్టి పెట్టాలని అవగాహన కల్పించారు. సర్పంచ్ సాయి మాట్లాడుతూ, యువత మంచి కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.