సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లిలోని తెలంగాణ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల మరియు కళాశాలలో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ కే. విష్ణువర్ధన్ రెడ్డి, ఏ. టీ. పీ రాధికల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులు, సిబ్బంది పాల్గొన్నారు. పువ్వులను పూజించే గొప్ప పండుగ తెలంగాణలో మాత్రమే జరుపుకుంటారని ఈ సందర్భంగా తెలిపారు. విద్యార్థుల ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.